అభిజిత్‌తో పెళ్లి.. గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిన హారిక ఫ్యామిలీ!

November 21, 2020 at 6:00 pm

బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్‌లో ప్ర‌స్తుతం ప‌ద‌కొండో వారం కొన‌సాగుతోంది. రోజు రోజుకు రంజుగా కొన‌సాగుతున్న బిగ్ బాస్ హౌస్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేస్తుంది. అయితే ఈ సీజ‌న్ ప్రేమ జంటల్లో అభిజిత్‌-హారిక జోడీ ఒకటి. హౌజ్‌లోకి వెళ్లిన కొత్తలో మోనాల్‌ కోసం తెగ ట్రై చేసిన అభిజిత్‌.. ఆ త‌ర్వాత హారిక‌కు ఫిక్స్ అయిపోయాడు.

ఎప్పుడు చూసినా అభిజిత్, హారికలు పక్కపక్కనే ఉండటం, ఒకరికోసం ఒకరు అన్నట్టుగా గేమ్ ఆడటం, నాగ్‌ కూడా వీకెండ్స్‌లో వీరి పై పంచ్ లు వెయ్యడంతో.. ఈ జంట బాగా హైలైట్ అయింది. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని.. బ‌య‌ట‌కు వ‌చ్చాక పెళ్లి కూడా చేసుకునేలా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తాజాగా వీరి రిలేష‌న్‌పై హారిక త‌ల్లి, అన్న స్పందించారు.

హారిక త‌ల్లి మాట్లాడుతూ.. `అభిజిత్-హారికల మధ్య రిలేషన్ మాకు ప్యూర్ ఫ్రెండ్ షిప్‌గానే అనిపిస్తుంది. ఒకవేళ అంద‌రూ అనుకుంటున్న‌ట్టు వాళ్లది లవ్వే అయితే మాకు ఎలాంటి స‌మ‌స్య‌ లేదు. అభిజిత్ వాళ్ల ఫ్యామిలీకి ఇబ్బంది లేకపోతే పెళ్లికి మాకు నో ప్రాబ్లమ్. కానీ, మాకు మాత్రం వాళ్లు ఫ్రెండ్స్ లాగానే క‌నిపిస్తున్నారు` అని ఆమె ఓపెన్‌గానే అభి-హారిక పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. ఇక ఇటీవ‌ల అభి పేరెంట్స్ కూడా హారిక కోడ‌లిగా ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే.

అభిజిత్‌తో పెళ్లి.. గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిన హారిక ఫ్యామిలీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts