
బీఐఎస్- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫైడ్ చేసిన హెల్మెట్లనే వాహనదారులు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవే ల మంత్రిత్వ శాఖ వారు ఆదేశాలు జారీ చేసారు. దీని వల్ల నాణ్యత లేని హెల్మెట్ల వాడటం నిరోధిస్తుందని, మంచి నాణ్యత కలిగిన హెల్మెట్లు వాహనదారులు వాడటం వల్ల ప్రమాదం నుంచి రక్షిస్తాయని సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశ వాతావరణ పరిస్థితులకు తగిన హెల్మెట్ల వాహనదారులు ఉపయోగించేలా వాటికీ సంబంధించి సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి మరో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇందులో బీఐఎస్, ఎయిమ్స్లాంటి సంస్థల నుంచి నిపుణులు ఉన్నారు. బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లను తప్పనిసరి చేయడాన్ని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ సంస్థ స్వాగతిస్తూ, ఒకసారి ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత వాహనదారులు బీఐఎస్ సర్టిఫైడ్ లేని హెల్మెట్ల వాడకం నేరం కింద పరిగణిస్తారని ఈ ఫెడరేషన్ అధ్యక్షుడు కేకే కపిల తెలిపారు.