ఓ పేద విద్యార్థిని కలను నిజం చేసిన సీమ రాజా..!!

November 22, 2020 at 3:10 pm

కొందరు సినీ హీరోలు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా తాము హీరోలని నిరూపించుకుంటుంటారు. ఈ కోవలోకే చెందుతారు తమిళ హీరో శివ కార్తికేయన్. డాక్టర్ కావాలన్న ఓ పేదింటి విద్యార్థిని ఆశను ఆయన నెరవేర్చారు. అసలు వివరాల్లోకి వెళ్తే… తంజావూర్‌ జిల్లా సమీపంలోని పూకొల్లై ప్రాంతానికి చెందిన సహానా అనే అమ్మాయి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌ టూ వరకు చదువుకుంది. ఆమె తల్లితండ్రులు కూలి పని చేసుకుంటూ ఇల్లు నడుపుతూ వాళ్ళ అమ్మాయిని చదివించుకుంటున్నారు.

గత సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన తమిళ పత్రికలో వెలువడిన ఓ కథనం సహానా జీవితాన్ని మార్చేసింది. ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న హీరో శివకార్తికేయన్‌ తంజావూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో సహానాకు నీట్ కోచింగ్ ఇప్పించారు. మొన్న జరిగిన నీట్‌ పరీక్షలో సహానా 273 మార్కులు సాధించి తిరుచ్చిలోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించింది.ఈ సందర్భంగా సహానా హీరో శివ కార్తికేయన్‌కు ధన్యవాదాలు చెప్పుకుని, తన వైద్య విద్యకు అయ్యే ఖర్చు మొత్తం ఆయనే భరిస్తానని హామీ ఇచ్చినట్లు సహానా తెలిపింది. మొత్తానికి ఓ పేద విద్యార్థి కలను నెరవేర్చినందుకు శివ కార్తికేయన్ రియల్ హీరో అంటున్నారు అందరు.

ఓ పేద విద్యార్థిని కలను నిజం చేసిన సీమ రాజా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts