హీటెక్కిన అసెంబ్లీ.. చంద్రబాబు నిరసన..?

November 30, 2020 at 3:13 pm

నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి రోజే వాడివేడిగా మారిపోయాయి అసెంబ్లీ సమావేశాలు. ఇక అసెంబ్లీ వేదికగా అధికార పార్టీని ప్రశ్నించేందుకు ప్రతిపక్ష టిడిపి పార్టీ ఎన్నో ప్రశ్నోత్తరాలను సిద్ధం చేసుకుంది ఈ క్రమంలోనే ముఖ్యంగా వరద బాధితులకు ప్రభుత్వం ఎందుకు నష్టపరిహారం చెల్లించలేక పోయింది అనే దాని పై అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై అటు ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగింది. ఈ క్రమంలోనే టిడిపి నేతలు రైతులకు నష్ట పరిహారం చెల్లించకపోవడం పై నిరసన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు సహా మరికొంతమంది నేతలు స్పీకర్ పోడియం కింద కూర్చుని నిరసన వ్యక్తం చేయడంతో స్పందించిన వైసీపీ నేతలు కావాలని అసెంబ్లీ సమయాన్ని వృధా చేయాలని ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో డ్రామాలు మొదలుపెట్టారు అంటూ విమర్శలు గుప్పించారు.

హీటెక్కిన అసెంబ్లీ.. చంద్రబాబు నిరసన..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts