హైదరాబాద్ కి ట్రంపు కూడా వస్తాడేమో.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..?

November 25, 2020 at 6:17 pm

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం వాడివేడిగా మారిపోయాయి. ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల బీజేపీ నేతలు చేసిన విమర్శలపై స్పందించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు ఇది గల్లీ ఎలక్షన్ అన్న విషయం మరిచిపోయినట్టు ఉన్నారని అందుకే ఇక్కడ జిహెచ్ఎంసి సమస్యల గురించి మాట్లాడకుండా బాబర్ అక్బర్ బిన్ లాడెన్ అంటూ ఎవరి గురించో మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు.

అంతేకాకుండా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారం కోసం ఏకంగా ఢిల్లీ లో ఉన్న బిజెపి నేతలు కూడా కదిలి వస్తున్నారని ఇలా చూసుకుంటే.. మోదీకి ఫ్రెండ్ అయినా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం కోసం వచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు అంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ కి ట్రంపు కూడా వస్తాడేమో.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts