హైదరాబాద్ కి 15లక్షల మంది.. ఎందుకో తెలుసా..?

November 24, 2020 at 3:21 pm

జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. గెలుపు కోసం ఉన్న అన్ని మార్గాలను కూడా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అభ్యర్థులు వినూత్న ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఇతర జిల్లాల ప్రాంతాల వారు ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. దీంతో వారికి ఓటు హక్కు కూడా వచ్చింది. అయితే ఇలా ఓటు హక్కు కలిగి ఉండి ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో ఉన్న వారిని వెతికి పట్టుకుని హైదరాబాద్ నగరానికి రప్పిస్తున్నారట అభ్యర్థులు.

దాదాపు ఇలా హైదరాబాద్ నగరంలో ఓటు హక్కు కలిగి ఉండి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు 15 లక్షల మంది వరకు ఉంటారని దీంతో వారందరినీ హైదరాబాద్ నగరానికి రప్పించేందుకు అభ్యర్థులు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇలా వారి ఓట్లను కూడా తమ గెలుపు కోసం ఉపయోగించుకోవాలని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్ కి 15లక్షల మంది.. ఎందుకో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts