
టాలీవుడ్ లో తన నడుమందాలతో కుర్రకారు మతి పోగొట్టి ట్రెండ్ సృష్టించిన అందాల భామ ఇలియానా. ఈ గోవా బ్యూటీ తెలుగులో ప్రముఖ స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. పోకిరి, జులాయి వంటి సినిమాల్లో నటించి తన నటనకు ప్రేక్షక ఆదరణ పొందారు ఇలియానా. ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ పలు తెలుగు, హిందీ, తమిళ భాషల సినిమాల్లో నటిస్తోంది. కానీ ఇలియానా ప్రస్తుతం సెలెక్టివ్ పాత్రలకు మాత్రమే ఒపుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్య ఇలియానా మూవీస్ చాలా తక్కువగానే వస్తున్నాయి. తాజాగా ఇలియానా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు వెల్లడించింది. అందం, శరీర సౌష్టవం తో ఎప్పుడు పర్ ఫెక్ట్ గా ఉండలేమని, అందరిలో ఏదో ఒక లోపంఉంటుందంటూ ఆమె చెప్పుకొచ్చారు. మనలో ఉన్న లోపాలను అధిగమిస్తూ సక్సెస్ ఫుల్ గా జీవితాన్ని కొనసాగించడంలోనే అసలైన ఆనందం ఉంటుందని చెప్పారు ఇలియానా.