జగన్ అందులో దిట్ట : చంద్రబాబు

November 17, 2020 at 5:13 pm

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరుపుతూ ఎప్పటికప్పుడు పార్టీ నేతలు అందరికీ దిశానిర్దేశం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి 173 నియోజకవర్గాల టిడిపి నేతలు ప్రజా ప్రతినిధులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి చర్చించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. అదే సమయంలో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అధికారంలోకి రాకముందు ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చారని.. పార్లమెంట్ లో వైసీపీకి 28 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా నోరు తెరవకుండా కేంద్రం ముందు మెడలు వంచుతున్నారు అంటూ విమర్శించారు. అమరావతిలో అభివృద్ధి పనులు నిలిపి వేయడం పోలవరం ప్రాజెక్టు విషయంలో అభివృద్ధి పనులు నిలిపి వేయడం దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికార దాహంతో జగన్ సర్కార్ గెలిపించిన ప్రజలకు ద్రోహం చేస్తోంది అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు.

జగన్ అందులో దిట్ట : చంద్రబాబు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts