
ఎ సూటబుల్ బాయ్ సిరీస్‌తో సయీదా బాయి పాత్రలో టబు ఎంతగా అలరించి మెప్పించారో తస్నీమ్ కూడా అంతగానే అలరించింది. ప్రస్తుతం జోయీతా దత్తా మీద ప్రేక్షకుల దృష్టే కాకుండా విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఆ ఒక్క సిరీస్‌తోనే టాప్ వాంటెడ్ యాక్ట్రెస్ అయిపోయింది. కాని జోయితా తొందరపడకుండా వచ్చిన అవకాశాలను ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది .జోయితాకి అనుకోకుండా మీరా నాయర్ దర్శకత్వం వహించిన సంగీతనాటకం మాన్సూన్ వెడ్డింగ్‌లో మంచి రోల్ దొరికింది. అందులో జోయీతా ఒక్క నటించడమే కాకుండా, ఆడింది పాడింది కూడా.
అలా తన అభినయానికే మీరా నాయర్ ముచ్చటి పడి మళ్ళి ఎ సూటబుల్ బాయ్ సిరీస్ లో తస్నీమ్‌గా ఓటీటీ వీక్షకులకు పరిచయం చేసింది. అమాయకమైన హావభావాలతో తనదైన నటనతో అందరి ద్రుష్టి తన వైపు తిప్పుకుంది జోయీతా. సినిమా ఇండస్ట్రీలో తన మార్క్ చూపించాలని ఆశపడ్తున్నట్లు చెప్పారు జోయితా దత్తా.