జుట్టుకు కూడా పన్ను విధిస్తారేమో..?

November 22, 2020 at 2:59 pm

ఇటీవలే రహదారులపై టోల్ ఫీజులు విధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇదే విషయంపై స్పందించిన ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గతంలో ఏపీ ప్రభుత్వం పెంచిన ఛార్జీలను కూడా ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడ్డారు వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి. జగన్ ప్రజలందరికీ సంక్షేమ పథకాల అమలు చేస్తుంది అని చెబుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చేది గోరంత అయితే ప్రజల నుంచి చార్జీల రూపంలో అంతకుమించి అనే రేంజ్లో వసూలు చేస్తోంది అంటూ విమర్శించారు.

మద్యం ధరలు భారీగా పెంచిన ఏపీ మందుబాబుల రక్తాన్ని ఏపీ ప్రభుత్వం సాగుతోందని అంతేకాకుండా ఇసుక సిమెంట్ విద్యుత్ ఆర్టీసీ… సహా మరికొన్ని ఛార్జీలు కూడా పెంచి ప్రస్తుతం ప్రజలందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ విమర్శలు గుప్పించారు. ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే జగన్మోహన్రెడ్డి సర్కార్.. టాక్స్ ల రూపంలో భారీగా వసూలు చేస్తుందని విమర్శించారు. రానున్న రోజుల్లో ఏకంగా జుట్టు బోడిగుండుకు కూడా టాక్స్ విధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ ఎద్దేవా చేశారు.

జుట్టుకు కూడా పన్ను విధిస్తారేమో..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts