హీరోగా మార‌బోతున్న దర్శకేంద్రుడు.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

November 28, 2020 at 10:12 am

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేంద్రరావు.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 1975లో విడుదలైన ‘బాబు’ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన రాఘ‌వేంద్ర‌రావు.. ఆ త‌ర్వాత ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అల‌రించారు. మూడు తరాల అగ్ర హీరోల కాంబినేషన్‌లో సినిమాలు చేయడమే కాకుండా.. అందరితోనూ భారీ విజయాలు అందుకుని స‌త్తా చాటారు.

అయితే గ‌త కొన్ని దశాబ్దాలుగా కెమెరా వెనకుండి అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన రాఘవేంద్రరావు ఇప్పుడు.. మొద‌టిసారి కెమెరా ముందుకు రాబోతున్నార‌ట‌. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో రాఘవేంద్రరావు హీరోగా న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ చిత్రానికి ప్రముఖ రచయిత జనార్దన మహర్షి కథను అందించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ సినిమాలు నలుగురు హీరోయిన్లు నటించనున్నారు. అయితే రమ్యకృష్ణ, శ్రియ, సమంతలను ఇప్పటికే హీరోయిన్లుగా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఇక నాల్గువ‌ హీరోయిన్‌గా మరో కొత్త భామ‌ను పరిచయం చేస్తారని సమాచారం.

హీరోగా మార‌బోతున్న దర్శకేంద్రుడు.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts