
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి.. వైవాహిక జీవితంలోకి అగుడుపెట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి పెళ్లి అనే వార్తలను ఖండిస్తూ వచ్చిన కాజల్.. చివరికి ముంబైలోని తాజ్ ప్యాలెస్ స్టార్ హోటల్లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగవైభవంగా గౌతమ్‌ను వివాహం చేసుకుంది.
ఇక పెళ్లి తర్వాత మల్దీవుల్లో ఈ కొత్త జంట హనీమూన్ ఎంజాయ్ చేశారు. అయితే కాజల్-గౌతమ్ మొట్టమొదట ఎక్కడ కలుసుకున్నారు? ఈ ప్రేమ ఎలా చిగురించింది? అన్న ప్రశ్నలో చాలా మంది మదిలో ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్.. గౌతమ్‌ను మొదట తాను ఎక్కడ మీట్ అయ్యానో తెలిపింది.
ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక సాధారణ స్నేహితుడి వివాహంలో మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నామని ఆమె వెల్లడించింది. ఆరంభంలో పెద్దగా మాట్లాడుకోనప్పటికీ.. మేమిద్దరం సన్నిహితంగా మెలిగేవారమని కాజల్ తెలిపింది. ఇక కొన్నేళ్ల క్రితమే ప్రేమకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఆ తర్వాత ఇరు కుటుంబాలు కలిశాయని.. లాక్డౌన్లో వివాహం చేసుకున్నామని కాజల్ వెల్లడించారు.