కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే.?

November 24, 2020 at 3:16 pm

జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అన్ని పార్టీలు ప్రస్తుతం ఓటర్లను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోలు సిద్ధం చేసి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసింది టిఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో విడుదల చేసింది ఇక ఈ మేనిఫెస్టో లో భాగంగా మొన్నటికి మొన్న హైదరాబాదు నుంచి వచ్చిన వరదల్లో నష్టపోయిన బాధితులకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టోలో హామీలను పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ.

హైదరాబాద్ లో వచ్చిన వరదలు కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం అందిస్తామని అంతేకాకుండా వరదల కారణంగా దెబ్బతిన్న వారికి 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు నష్టపరిహారం అందిస్తామని మేనిఫెస్టోలో హామీ పొందుపరిచింది. అంతేకాకుండా.. వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైలు లో దివ్యాంగులు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే.?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts