కేసిఆర్ మళ్లీ అదే చెబుతున్నారూ : అరవింద్

November 24, 2020 at 6:27 pm

ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఎవరికి వారు ముమ్మర ప్రచారం చేయడంతో పాటు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించుకుంటున్నారు ఇక ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ ధర్మపురి అరవింద్ కెసిఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నిక లో గెలిచినప్పుడు చేస్తామని చెప్పారో అవి నెరవేర్చకుండా నే మళ్ళీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో అదే చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ధర్మపురి అరవింద్. కేసీఆర్ చెప్పిన మాటలను ప్రజలు ప్రస్తుతం నమ్మే పరిస్థితిలో లేరని… ఆయన వ్యాఖ్యానించారు గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మళ్ళీ తూచా తప్పకుండా జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో విడుదల చేశారు అంటూ విమర్శించారు ఎంపీ ధర్మపురి అరవింద్.

కేసిఆర్ మళ్లీ అదే చెబుతున్నారూ : అరవింద్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts