కెసిఆర్ పై.. ప్రజలు నమ్మకం కోల్పోయారు..?

November 22, 2020 at 3:04 pm

దుబ్బాక ఉప ఎన్నికల నుంచి బీజేపీ అధికార టీఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో మరోసారి తన విమర్శల పర్వం ని పెంచింది బిజెపి. ఇక ఇటీవలే జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే అయ్యాయి అంటూ విమర్శలు గుప్పించారు కిషన్ రెడ్డి. డబుల్ బెడ్ రూములు ఇస్తాము అని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత మాత్రం డబుల్ బెడ్రూంలు ఇవ్వకుండా మోసం చేసింది అంటూ విమర్శలు గుప్పించారు. కెసిఆర్ ఎన్నో మాటలు చెబుతున్నప్పటికీ ప్రజలు కేసీఆర్ నమ్మే పరిస్థితులో లేరని… ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కెసిఆర్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయావు అంటూ విమర్శించారు కిషన్ రెడ్డి.

కెసిఆర్ పై.. ప్రజలు నమ్మకం కోల్పోయారు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts