ఎన్టీఆర్ పాటకి మొదటి బహుమతి…!

November 21, 2020 at 6:07 pm

అప్పట్లో తెలుగు వారందరు అన్నగారు అని అభిమానంతో పిలుచుకొనే వ్యక్తి నందమూరి తారక రామారావు. విశ్వ విఖ్యాత నటసారభౌమగా ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి, ప్రేక్షకులని తన నటనతో అక్కటుకున్నారు. ఆయన నటించిన సినిమాలలో ‘జగదేకవీరునికథ’ ఒకటి. కె.వి.రెడ్డి దర్శకత్వంలో 1961లో విడుదలైన ఈ చిత్రంలో అన్ని పాటలు ప్రేక్షక ఆదరణను పొందాయి. వాటిలో ముక్యంగా శివశంకరి పాట ఇప్పటికి ఎవర్‌గ్రీన్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయి సంగీతాభిమానులను అలరిస్తుంటుంది. ఈ పాటను ఘంటశాల ఆలపించారు.

ఇటీవలే ఈ అద్భుతమైన పాటను కేరళలో జరిగిన స్వరమంజరి సంగీత ప్రతిభ అనే మ్యూజిక్‌ కాంపిటీషన్‌ ప్రోగ్రాంలో మలయాళీ సింగర్‌ సౌజీ జార్జ్‌ పది వినిపించారు. ఈ పాట విన్న సంగీతాభిమానులు, న్యాయ నిర్ణేతలు ఇటువంటి అద్భుతమైన పాటను ఆమె మరింత అద్భుతంగా ఆలపించారంటూ ప్రశంసించారు. ఈ పాట పాడిన సౌజీ జార్జ్‌కి మొదటి బహుమతి వచ్చింది. మొదటి బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఇచ్చారు కాంపిటీషన్ వారు. ఇది తెలుగువారందరికీ ఇంకా ఎన్టీఆర్ అభిమానులకు గర్వించే సంఘటన.

ఎన్టీఆర్ పాటకి మొదటి బహుమతి…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts