ఆ హీరోయిన్లు చూసి కియారా తెగ కుళ్లుకుంద‌ట‌.. !

November 29, 2020 at 10:57 am

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు హీరోగా వ‌చ్చిన `భార‌త్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న `వినయ విధేయ రామ`లో న‌టించినా.. ఈ సినిమా పెద్ద‌గా హిట్ కాలేదు. కానీ, కియారాకు మాత్రం న‌ట‌న ప‌రంగా బాగానే మార్కులు ప‌డ్డాయి.

ఇక అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న‌ కియారా అద్వానీ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. అక్క‌డ వ‌రుస అవ‌కాశాలు అంద‌రూ క్ష‌ణం తీరిక లేకుండా దూసుకుపోతోంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన కియారా.. త‌న గురించి కొన్ని షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. కియారా మాట్లాడుతూ.. తాను కెరీర్ ప్రారంభించక ముందు కత్రిన, దీపిక లాంటి స్టార్లను చూసి అసూయ పడ్డాన‌ని తెలిపింది.

అందానికి అందం, ఒడ్డు పొడుగు ఉన్న హీరోయిన్లుగా వారిని గుర్తించి ఈర్ష్యతో కుళ్లుకుపోయాన‌ని.. వారిలా పొడుగుకాళ్లు అందరికీ రావు.. ఇక ప్రతిభ అనేది హార్డ్ వర్క్ తో ముడిపడినది అని కియారా ఎలాంటి మొహ‌మోటం లేకుండా చెప్పేసింది. దీంతో నెటిజ‌న్లు.. `ప్ర‌స్తుతం నువ్వు కూడా ఆ స్టార్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోవంటూ` కియారాపై పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారు.

ఆ హీరోయిన్లు చూసి కియారా తెగ కుళ్లుకుంద‌ట‌.. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts