
ప్రస్తుతం గూగుల్ పే కు సంబంధించిన అన్ని రకాల పేమెంట్లు కస్టమర్లు ఉచితంగానే పొందుతున్నారు అనే విషయం తెలిసిందే. కానీ సరికొత్త గూగుల్ పేమెంట్ యాప్ ద్వారా జనవరి 1 నుంచి ఎలాంటి పేమెంట్ చేసిన ఛార్జీలు చెల్లించాలి అంటూ ఇటీవలే గూగుల్ పే ప్రకటించింది. దీంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన గూగుల్ పే వినియోగదారులందరూ తీవ్ర ఆందోళన చెందారు. ఇక తాజాగా గూగుల్ పే ప్రకటనపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చింది గూగుల్ పే.
తాము పేమెంట్ లపై ఛార్జీలు విధించిన ఉన్న మాట వాస్తవమేనని కానీ అది ఇండియాలో ఉన్న వినియోగదారులకు వర్తించదని కేవలం అమెరికాలో ఉన్న వినియోగదారులకు మాత్రమే ఛార్జీలు విధించేందుకు గూగుల్ పే నిర్ణయించింది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా జనవరి 1వ తేదీ నుంచి సరికొత్తగా రీడిజైన్ చేసిన యాప్ అందరికీ అందుబాటులో ఉంటుంది తెలిపింది.