కోహ్లీ అది సాధించాకే రిటైర్ అవుతాడటా..!

November 23, 2020 at 6:17 pm

ప్రస్తుతం టీమిండియా ను తన సారథ్యంలో ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్న టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇప్పటికీ అందని ద్రాక్షల మారిపోయింది వరల్డ్ కప్. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో వరల్డ్ కప్ గెలిచేందుకు అవకాశం వచ్చినప్పటికీ తృటిలో మిస్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్ గెలిచేందుకు ప్రస్తుతం విరాట్ కోహ్లీకి అవకాశం ఉంది.

తాజాగా ఇదే విషయంపై మాట్లాడిన భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ లో గొప్ప సారథ్య లక్షణాలు ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించిన హర్భజన్ సింగ్… వచ్చే టి20 వరల్డ్ కప్ తప్పక సాధించి తీరుతాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్న భారత జట్టు ను చూస్తుంటే వరల్డ్ కప్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అని అనిపిస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు హర్భజన్ సింగ్.

కోహ్లీ అది సాధించాకే రిటైర్ అవుతాడటా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts