
ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టుకు మొదటి వన్డేలో నే ఎదురు దెబ్బ తగిలింది అన్న విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత జట్టుకు మొదటి మ్యాచ్ లో నిరాశే ఎదురయింది. నిన్న ఆస్ట్రేలియా భారత్ మధ్య సిడ్నీ వేదికగా జరిగిన మొదటి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.
అదే సమయంలో టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ టీమిండియాకు భారీ జరిమానా విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం టీమ్ ఇండియా లోని ఆటగాళ్ల వేతనంలో 20 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తిచేయడంతో ఎలాంటి జరిమానా పడలేదు.