
`బోణీ` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృతి కర్బంద గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందం, అభినయం ఉన్న ఈ భామ పవన్ కళ్యాణ్‌తో తీన్ మార్, రామ్ చరణ్‌తో బ్రూస్ లీ, రామ్‌తో ఒంగోలు గిత్త, ఓం 3D ఇలా పలు సినిమాలు చేసినా.. టాలీవుడ్లో నిలదొక్కుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్‌కు మఖాం మార్చేసింది.
అయితే అక్కడ వరుస సినిమాలతో బిజీ అయిపోయిన ఈ భామ.. మరోవైపు బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్‌తో ప్రేమాయణం నడిపిస్తోంది. వీర్ కి వెడ్డింగ్, పాగల్ పంతీ సినిమాల్లో నటించిన వీరిద్దరూ గత కొంత కాలంలో డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి.అయితే ఈ వార్తలపై తాజాగా కృతి స్పందిస్తూ.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్ధేశమే లేదంటోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ.. `పులకిత్ చాలా మంచి వ్యక్తి. మా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. అందుకే ఏడాదిన్నర నుంచి డేటింగ్లో ఉన్నాం. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం ఇద్దరం కెరీర్‌పైనే దృష్టి సారించాం. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాము` అని తెలిపింది. కాగా, పులకిత్ కి గతంలోనే వివాహం జరిగింది. శ్వేతా రోహిరాని పెళ్లి చేసుకున్న పులకిత్ కొన్ని విభేదాల కారణంగా ఆమెతో విడిపోయారు. ఇప్పుడు కృతితో డేటింగ్ చేస్తున్నాడు.