`ఆదిపురుష్` లో ప్ర‌భాస్‌కు జోడీ దొరికేసింది.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

November 28, 2020 at 3:31 pm

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `ఆదిపురుష్‌` ఒక‌టి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్రం 11 ఆగష్టు 2022న విడుదల చేయనున్నట్టు ఇప్ప‌టికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వ‌చ్చే సంక్రాంతి తర్వాత ప్రభాస్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడట.

పౌరాణిక నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా క‌నిపించ‌నున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాతో ప్ర‌భాస్‌కు జోడీ ఎవ‌ర‌నేది క్లారిటీ లేదు. ఇప్ప‌టికే కియారా అద్వానీ, అనుష్క శర్మ, కీర్తి సురేష్‌, అనన్యా భట్‌, అనుష్క శెట్టి ఇలా ప‌లు పేర్లు వినిపించారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌భాస్‌కు జోడీగా కృతి సనన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా, మ‌హేస్ స‌ర‌స‌న‌ 1 – నేనొక్కడినే, నాగ చైత‌న్య స‌ర‌స‌న దోచేయ్ వంటి సినిమాల్లో న‌టించిన కృతి స‌న‌న్‌కు నిజంగానే ఆదిపురుష్‌లో ఛాన్స్ దొరికితే.. ఆమెకు ఇదో బిగ్‌ ఆఫర్ అవుతుంది.

`ఆదిపురుష్` లో ప్ర‌భాస్‌కు జోడీ దొరికేసింది.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts