బిగ్‌బాస్ నుంచి ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌!

November 22, 2020 at 2:39 pm

బిగ్ బాస్ సీజ‌న్ 4లో ప‌ద‌కొండో వారం కూడా పూర్తి కాబోతోంది. ఇప్ప‌టికే సూర్య కిర‌ణ్‌, క‌రాటే క‌ళ్యాణి, యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్‌, గంగ‌వ్వ‌, సుజాత‌, దివి, నోయ‌ల్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, మెహ‌బూబ్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం అరియానా, హారిక‌, మోనాల్‌, లాస్య‌, అభిజిత్ మ‌రియు సొహైల్‌లు నామినేష‌న్‌లో ఉన్నారు.

వీరిలో ఒక‌రు ఈ రోజు ఎలిమినేట్ కానున్నారు. అయితే వీరిలో మోనాల్ మిన‌హా.. మిగిలిన ఐదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. దీంతో ఈ రోజు ఎవ‌రు ఎలిమినేట్ కాబోతున్నార‌న్న ఉత్కంఠ ప్రేక్ష‌కుల్లో ఉండ‌గా.. తాజాగా స‌మాచారం ప్ర‌కారం లాస్య ఎలిమినేట్ అయ్యింద‌ట‌. వాస్త‌వానికి లాస్య టాప్‌-5లో ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. అంతేకాదు, ర‌న్న‌ర‌ప్ కూడా లాస్య ఉంటుంద‌ని అనుకున్నారు.

కానీ, లాస్య గాసిప్స్ మాట్లాడ‌టం, వంట గ‌దికే ప‌రిమిత‌మ‌వుతూ టాస్కుల్లో వెన‌క‌బ‌డిపోవ‌డంతో ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపుకు తిప్పుకోలేక‌పోయింది. ఇక ఈమెతో పాటుగా మోనాల్ గజ్జర్ కూడా డేంజర్ జోన్ లో ఉంది. అయితే గ‌త రెండు వారాలుగా ఆమె తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కావ‌డంతో.. ఓటింగ్‌లో బాగా పుంజుకుంది. ఈ క్ర‌మంలోనే మోనాల్‌కే ఎక్కువ ఓట్లు ప‌డ‌డంతో.. లాస్య ఇంటి బాట ప‌ట్టింద‌ని స‌మాచారం. ఇక టాప్-5 ఉంటుంద‌ని భావించిన అభిమానులు.. ఆమె ఎలిమినేట్ కావ‌డంతో షాక్ అవుతున్నారు.

బిగ్‌బాస్ నుంచి ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts