
మాధురీ దీక్షిత్ అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లో అగ్ర తారగా ఎదిగి ఎనో సూపర్ హిట్ మూవీస్ లో నటించి, తన అందం నటన ఇంకా డాన్స్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి ఆమె. నటి అని ప్రత్యేకంగా చెప్పే పని ఉంది. అది ఏంటంటే, తాజాగా ఆమె నటించనున్న వెబ్ సిరీస్ టైటిల్ యాక్ట్రెస్ అంటే నటి అని అర్ధం. ఈ వెబ్ సిరీస్లో మాధురి టైటిల్ రోల్లో నటిస్తున్నారు. ఒకప్పుడు బాగా నటించి వెలిగి అకస్మాత్తుగా మాయమైపోయే సినిమా నటి నటులు జీవితం ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది.
ఇందులో మరో విశేషం ఏంటంటే, 23 ఏళ్ల గ్యాప్ తర్వాత హీరో సంజయ్ కపూర్, మాధురీ దీక్షిత్ కలిసి నటించి, స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ అనగానే వెంటనే గుర్తొచ్చే సినిమా రాజా. 1995లో రిలీజ్ అయినా ఈ చిత్రం అప్పట్లో పెద్దహిట్. ఆ తర్వాత 1997 లో మొహబ్బత్ చిత్రంలో కలసి నటించారు.ఇన్నాళ్ల తరువాత మళ్లీ కలసి నటిస్తున్నారు.