80 ఏళ్ల వయసులో పెళ్లి..!?

November 21, 2020 at 7:28 pm

అందరూ తమ జీవితంలో ఒక్కసారి అయినా పెళ్లి చెసుకుంటారు. కానీ రెండు సార్లు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అది కూడా 70 ఏళ్లు పైబడిన తర్వాత. ఇటీవలే మహరాష్ట్ర యవాత్మాల్ జిల్లాలోని ఖండాలా గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఇలా అరుదైన రీతిలో పెళ్లి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. శ్రీరామ్ హివ్రాలే వయసు 81, నిర్మలా ఇంగోల్ వయసు 71 . వీళ్లిద్దరు మొదటిసారి 1955 నవంబరు 16న వివాహం చేసుకున్నప్పుడు వారిద్దరు మైనర్లు కావడం విశేషం. ఇద్దరికీ పెద్దలు కుదిర్చి పెళ్లి చేసారు. ఈ ఏడాదితో వారి వివాహం అయ్యి సరిగ్గా 65 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే అప్పట్లో వాళ్ళ పెళ్లి ఇద్దరికీ పెద్దగా గుర్తు లేకపోవడంతో పిల్లలంతా కలిసి మళ్లి వివాహం జరిపించాలని నిశ్చయించారని పెద్ద కుమారుడు పండ్లిక్ తెలిపారు.

రెండో సారి జరిగిన ఈ పెళ్లికి పెద్ద కుమారుడితో పాటు వారి చిన్న కొడుకు, పెద్ద చెల్లి, కూతురు, మనుమలు అంతా హాజరయ్యారు. మాములుగా పిల్లలు వాళ్ళ తల్లితండ్రులకు గోల్డెన్, సిల్వర్ జూబ్లీ వివాహాలు జరిపించడం కొత్తేమి కాదు. కానీ ఈ పెళ్లికి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఈ వృద్ధ దంపతులకు పెళ్లి చేయాలనే ఆలోచన తమ చెల్లిదే అంటూ చిన్నకుమారుడు పండిట్ అన్నారు. కుటుంబ సభ్యులు అంతా వెంటనే దీనికి ఒప్పుకోవడంతో ఈ వివాహం జరిపించినట్లు వారు తెలిపారు. కరోనా కారణంగా ఈ వివాహానికి కేవలం 50 మంది మాత్రమే ఆహ్వానించారని తెలిపారు. గ్రామంలో తమ పూర్వీకులు కట్టించిన ఇంటిలో వీరి పెళ్లి చేసారు అందరు. వృద్ధ దంపతుల కొడుకులు,కూతురు, మనుమలు, ముని మనుమలు కలిసి పెళ్లి మహోత్సవానికి హాజరయ్యారు.

80 ఏళ్ల వయసులో పెళ్లి..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts