తనయుడితో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు క్యూట్ పిక్..

November 11, 2020 at 3:19 pm

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ లో పెద్ద హీరో అయినప్పటికీ తన ఫ్యామిలీ విషయంలో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారని మనకు తెలుసు. తనకు ఏ మాత్రం తీరిక దొరికినా ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకి వెళ్ళటానికి ఆయన ఇష్టపడతారు. పిల్లల విషయంలో మహేష్ ఎలా ప్రవర్తిస్తారో తాను పోస్ట్ చేసే ఫొటోలను చూస్తే అర్ధమవుతుంది. మహేష్ ఫొటోలు షేర్ చేసిన ప్రతి సారి ట్రెండ్ సృష్టిస్తాయి.

ఇటీవలే మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర కి వెళ్లిన విషయం తెలిసిందే. ఎయిర్ పోర్ట్ నుండి మొదలుపెట్టి మహేష్ తన పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోష మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా మహేష్ తన తనయుడు గౌతమ్ తో ఉన్న ఒక క్యూట్ పిక్ ని షేర్ చేసాడు. ఇప్పుడు గౌతమ్ ని హగ్ చేసుకోవడం కష్టం అంటూ,అయినా ప్రేమతో దగ్గరికి తీసుకోవడానికి టైం, కారణం అవసరం లేదని మహేష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అయింది.

తనయుడితో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు క్యూట్ పిక్..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts