మహేష్ సినిమాకు.. క్లాప్ కొట్టి స్విచ్ ఆన్ చేసిన సితారా, నమృత..?

November 21, 2020 at 4:57 pm

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కాగా ఈ సినిమాకు పూజా కార్యక్రమం జరిగింది. ఇటీవలే మహేష్ బాబు కుటుంబం సమక్షంలో చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తి చేసింది. ఈ పూజా కార్యక్రమంలో మహేష్ బాబు సతీమణి నమ్రత తో పాటు సితార కూడా పాల్గొన్నారు.

సర్కారీ వారి పాట పూజా కార్యక్రమంలో భాగంగా సితార మొదటి క్లాప్ కొట్టగా కెమెరా స్విచ్చాన్ చేశారు మహేష్ బాబు సతీమణి నమ్రతా. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సరికొత్త గెటప్ తో మహేష్ బాబు కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.

మహేష్ సినిమాకు.. క్లాప్ కొట్టి స్విచ్ ఆన్ చేసిన సితారా, నమృత..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts