
బాలీవుడ్ యాక్టర్ మలైకా అరోరా కరోనా బారిన పది తిరిగి డాక్లర్ల సలహాలు, సూచనలు పాటించి ధైర్యంతో కరోనా నుంచి కోలుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఒక్క విషయం తప్ప ఈ సంవత్సరంలో మలైకా జీవితంలో అన్నీ ఆనందకరమయిన క్షణాలతో నిండిపోయింది. ఈ డ్యాన్సింగ్ బ్యూటీ 2020ను పొగుడుతూ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. మలైకా కుమారుడు అర్హాన్, బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్, ఇంకా తన కుటుంబసభ్యులతో గడిపిన ఆనంద క్షణాల వీడియో ఆల్బమ్ ను ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
తాను కోరుకున్న ప్రతీది పొందిన ఏడాది 2020 అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ అర్జున్‌కపూర్, తన పిల్లలతో, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తో సిస్టర్స్ తో గడిపిన ఆనంద క్షణాలను వీడియోలో చూడొచ్చు. నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు అందరికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది . మలైకా షేర్ చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.