కొడుకుతో క్రికెట్‌ ఆడుతూ.. బాలీవుడ్ నటి!!

November 26, 2020 at 7:05 pm

బాలీవుడ్‌ అందాల నటి మలైకా అరోరా తన కోడుకు అర్హాన్ ఖాన్‌తో క్రికెట్‌ ఆడుతూ సందడి చేస్తున్నారు. ఇటీవలే ధర్మశాల నుండి తిరిగి ముంబైకి చేరిన మలైకా అర్హాన్‌తో కలిసి క్రికెట్ ఆడుతూ సందడి చేసారు. వారు ఇద్దరు కలిసి తమ ఇంటినే క్రికెట్‌ పిచ్‌గా మార్చేసి క్రికెట్ ఆడుతూ, తెగ ఎంజాయ్ చేసారు. అథ్లెటైజర్ ధరించి ఉన్న మలైకా, అర్హాన్ బౌలింగ్‌ చేస్తు బిగ్‌షాట్స్‌ కొడుతున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ వయసులో కూడా ఫిట్‌నెస్‌తో వావ్ అనిపించేలా ఉన్నారు మలైకా. తల్లి కొడుకుల బ్యాటింగ్‌, బౌలింగ్‌ పిక్స్ చుసిన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

మరో పిక్ లో బాడ్మింటన్‌ ఆడుతూ కనిపించిన మలైకా పిక్ కి సూపర్ కూల్ మామ్ అంటూ కమెంట్‌ చేస్తున్నారు నెటిజెన్స్. మొదటి భర్త ఆర్భాజ్‌ ఖాన్‌తో విడాకులు అనంతరం అర్జున్‌ కపూర్‌ని మలైకా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కొడుకుతో క్రికెట్‌ ఆడుతూ.. బాలీవుడ్ నటి!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts