రవితేజ హీరోయిన్ కి అంత పెద్ద సమస్యా..?

November 24, 2020 at 6:33 pm

నేల టిక్కెట్ చిత్రంలో రవితేజా సరసన హీరోయిన్‌గా నటించిన మాళవికా శర్మ తెలుగులో ఆ చిత్రంతో మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం ఈ అందాల భామ వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న రెడ్‌ చిత్రంలో అవకాశం కొట్టేసింది. ఈ చిత్రం ఇంకా పూర్తి కాకముందే మరో రెండు సినిమా ఆఫర్లు క్యూలో ఉన్నాయి ఈ అందాల భామ ఖాతాలో. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన సంగతులను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు మాళవికా.

ఇటీవలే ఆమె ఫాన్స్ కి గుండె పగిలే ఓ నిజాన్ని చాలా సింపుల్‌గా నవ్వుతూ చెప్పింది మాళవికా. ఈ అందాల భామ క్లెప్లమెనియాక్ అనే విచిత్రమైన మానసిక రుగ్మతితో బాధపడుతోందట. ఈ సమస్య ఉన్న వారికీ చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలని అనిపిస్తుందట. ఏదైనా ఒక వస్తువు తమ కంటి ముందు కనిపిస్తే చాలు దాన్ని దొంగతనం చేసేవరకు మనసు పీకుతుందని ఆమె చెప్పుకొచ్చారు.ఈ సమస్య వల్ల తాను చాలా సార్లు ఇబ్బంది ఎదురుకున్నానని మాళవికా చెప్పింది. తన వెంట ఎప్పుడు ఎవరొకరు ఉంటూ తన మనసును పక్కదారి పట్టిస్తుంటారని చెప్పుకొచ్చారు మాళవిక. వినటానికి సరదాగా ఉన్న..ఒక హీరోయిన్ కి ఇటువంటి సమస్య ఉండటం బాధాకరమే.

రవితేజ హీరోయిన్ కి అంత పెద్ద సమస్యా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts