మలేషియాలో తెలంగాణ వాసి మృతి..?

November 24, 2020 at 6:13 pm

పొట్ట చేతపట్టుకుని విదేశాలకు వెళ్తే అక్కడ విధి అతని చిన్న చూపు చూసింది. చివరికి దేశం కాని దేశం వెళ్లి అక్కడ గుండెపోటుతో మరణించాడుతెలంగాణకు చెందిన వ్యక్తి. దీంతో అతని కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది కనీసం తమ ప్రియమైన వ్యక్తి యొక్క చివరి చూపైనా దక్కుతుందా లేదా అని తీవ్ర ఆందోళనలో బరువెక్కిన హృదయంతో అధికారులను ఆశ్రయించడంతో అధికారులు మృతదేహాన్ని తెలంగాణ కు రప్పించారు. ఈ విషాదకర ఘటన నిజాంబాద్ లో చోటుచేసుకుంది.

నిజాంబాద్ జిల్లా గోపన్ పల్లి గ్రామానికి చెందిన బార్ల రవీందర్ అనే వ్యక్తి పొట్టకూటి కోసం మలేషియాలోని జోహార్బార్ కి వెళ్ళాడు ఈ క్రమంలోనే ఇటీవలే అనారోగ్యం బారిన పడి గుండెపోటుతో మరణించాడు. తెలంగాణలో నిజాంబాద్ జిల్లాలో ఉన్న మృతుడి భార్య బాల లక్ష్మికి తెలియడంతో బంధువులకు చెప్పింది. బంధువులు అధికారులను ఆశ్రయించడంతో అధికారులు మలేషియాలోని అధికారులతో సంప్రదింపులు మృతదేహాన్ని వందే భారత్ మిషన్ లో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి తీసుకు వచ్చారు.

మలేషియాలో తెలంగాణ వాసి మృతి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts