మంచు విష్ణు కోసం ఆ ఇద్ద‌రు హీరోయిన్లు.. శ్రీను వైట్ల ఓటు ఎవ‌రికో?

November 25, 2020 at 7:25 am

మంచు విష్ణు సినీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన `ఢీ` చిత్రాన్ని ఎవ‌రూ అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు. జెనీలియా, శ్రీ‌హ‌రి, బ్ర‌హ్మానందం, సునీల్, జయప్రకాశ్ రెడ్డి కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం ఎవ‌ర్‌గ్రీన్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్రెల్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ 13 ఏళ్ల త‌ర్వాత ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల‌- మంచు విష్ణు కాంబో సెట్ అయింది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఢీ కి సీక్వెల్‌గా ‘డి అండ్ డి’ సినిమాను ప్రకటించారు.

అవ్రమ్ భక్త మంచు సమర్పణలో వస్తున్న ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తుండ‌గా.. భీష్మతో బాగా పాపులర్ అయిన మహతి స్వర భాస్కర్ ఈ సినిమాకి సంగీతం అందించ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సీక్వెల్‌లో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు..? ఢీలో బ్రహ్మానందం, శ్రీహరి పాత్రలను ఇప్పుడు ఎవరితో చేయిస్తారు..? అన్న చర్చ అంద‌రిలోనూ మొద‌లైంది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప్రగ్యా జైశ్వాల్‌ మ‌రియు అనూ ఇమ్మాన్యుల్ ఇద్ద‌రిలో ఒక‌రిని హీరోయిన్‌గా ఎంపిక చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది. మొత్తానికి విష్ణు కోసం ఇద్ద‌రు హీరోయిన్లు లైన్‌లో ఉన్నారు. మ‌రి వీరిలో శ్రీ‌ను వైట్ల ఎవ‌రికి ఓటేసి ఎంపిక చేస్తారో చూడాల్సి ఉంది. కాగా, ప్రగ్యా ఇప్పటికే మంచు విష్ణు సరసన ఆచారి అమెరికా యాత్రలో నటించిన సంగ‌తి తెలిసిందే.

మంచు విష్ణు కోసం ఆ ఇద్ద‌రు హీరోయిన్లు.. శ్రీను వైట్ల ఓటు ఎవ‌రికో?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts