
కరోనా సమయంలో డైరెక్టర్ పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆడియన్స్ తో పూరీ జగన్నాధ్ తన అనుభవాలు షేర్ చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇదే బాటలో మన సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని కూడా చేరారు. ఆమెకు చిన్నప్పటి నుండి తన టీచర్స్ నేర్పిన ఎన్నో విషయాలుతో పాటు తన జీవిత అనుభవాలని ఆడియన్స్‌తో పంచుకోవడానికి మంజుల ఘట్టమనేని` పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ మరియు వెబ్ సైట్‌ని ఆమె ప్రారంభించారు.
ప్రిన్స్ మహేష్ గురించి ఆయన సోదరి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. వయసులో మహేష్ తన కంటే చిన్నవాడైనా సరే, చాలా సార్లు తనని అనేక విషయాలలో గైడ్ చేసాడని మంజుల చెప్పుకొచ్చింది. మాములుగా అందరూ తనకన్నా నేనే పెద్దదాన్ని కాబట్టి మహేష్‌ని నేనే గైడ్ చేస్తానని అనుకుంతారు కాని అది నిజం కాదని మంజుల చెప్పుకొచ్చారు. ఎలాంటి విషయం గురించి సలహా కావాలన్నా మహేష్ పర్ఫెక్ట్ గా సలహా ఇస్తూ ఉంటాడు అని ఆమె తెలియజేసింది. చాలా మంది మహేష్ బాబు బ్యూటీ సీక్రెట్స్ అడుగుతున్నారని, అయితే మహేష్ పెద్దగా ఏమి ఫాలో అవ్వరని అవన్నీ మా నాన్నగారి నుండి జీన్స్ గా వచ్చాయని మంజుల చెప్తున్నారు.