మర్యాద రామన్న.. మళ్ళీ రిపీట్!!

November 26, 2020 at 5:31 pm

ప్రస్తుతం హీరోగా చేస్తున్న సునీల్, ఒకప్పుడు కమెడియన్ గా ఉండి తరువాత హీరోగా మారారు. మొదట్లో కొన్ని విజయాలు అందుకున్నప్పటికీ, ఆ తర్వాత సినెమాలలు పెద్దగా హిట్ అవ్వలేదు. హీరోగా విజయాలు దక్కకపోయేసరికి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తన సినీ కెరీర్ సాగిస్తున్నాడు. మరలా తాజాగా సునీల్ హీరోగా విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఎవ్వరికి తేలికుండా చాలా సైలెంట్గా రూపొందుతున్న ఈ చిత్రం,దాదాపు చివరి దశకి చేరుకుంది.

ఈ చిత్రంలో హీరో సునీల్ సరసన హీరోయిన్ గా సలోని నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. సునీల్, సలోని జంటగా ఇదివరకే రాజమౌళి రూపొందించిన మర్యాద రామన్న చిత్రంలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్ద హిట్ సాధించింది. ప్రస్తుతం మరలా వీరిద్దరు కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

మర్యాద రామన్న.. మళ్ళీ రిపీట్!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts