మేనిఫెస్టోను చెత్తలో పడేయాలి : ఉత్తమ్

November 24, 2020 at 2:59 pm

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి రాజుకున్నాయి. ప్రతిపక్షం అధికార పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇచ్చి నెరవేర్చకుండా వదిలేసిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. టిఆర్ఎస్ ప్రభుత్వ హామీలను ఎండగట్టారు.

గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్వి ఎన్నో హామీలు ఇచ్చిందని కానీ అవేవీ కూడా ఇప్పటికే ఆచరణలోకి రాలేదు అంటూ విమర్శించారు. హుస్సేన్ సాగర్ నీటిని శుద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చిందని అంతే కాకుండా ఎంతో మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని.. నాలాల ఆధునీకరణ చేస్తామని.. హైదరాబాద్లో ఎక్కడైనా ఉచిత వైఫై వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని ఇప్పుడు ఆ హామీలన్నీ నీటి మూటలు అయ్యాయి అంటూ విమర్శించారు.

మేనిఫెస్టోను చెత్తలో పడేయాలి : ఉత్తమ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts