మెరుగైన సేవలు కోసమే ఈ పన్నులు : మంత్రి బొత్స

November 25, 2020 at 5:27 pm

వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్ను పెంపు ఉంటుంది అంటూ ఇటీవల జగన్ సర్కార్ ప్రకటించడం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ వచ్చిన జగన్ సర్కార్ ప్రస్తుతం ఆస్తి పన్ను కూడా పెంచడాన్ని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో తప్పుబడుతూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి తాజాగా ఇదే విషయంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

ఆస్తి యొక్క విలువలో కేవలం జీరో పాయింట్ 10 శాతం నుంచి 0.50 శాతం మాత్రమే ఆస్తి పన్ను విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అంటూ బొత్ససత్యనారాయణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు ఉన్న ఒకే ఒక మార్గం ఇదే అంటూ ఆయన చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసి మెరుగైన సేవలు అందించడం కోసమే ఈ పన్ను లు పెంచుతున్నామూ అంటూ చెప్పుకొచ్చారు సత్యనారాయణ ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

మెరుగైన సేవలు కోసమే ఈ పన్నులు : మంత్రి బొత్స
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts