
జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్నది బిజెపి.. ఢిల్లీ పెద్దలను కూడా రంగంలోకి దింపి ప్రచారం చేయించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే బిజెపి ఢిల్లీ పెద్దలైన అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీ లో రంగంలోకి దిగి ప్రచారం చేయనున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన పై స్పందించిన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక పార్లమెంటు సభ్యుడు అయిన తనకు కనీసం ప్రధాని నరేంద్ర మోదీ కి స్వాగతం పలికేందుకు ఆహ్వానం కూడా లేదని కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన వ్యక్తిగతం కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. ప్రజా ప్రతినిధి అయిన తనను ఇంత అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై లోక్ సభలో స్పీకర్ కు ఫిర్యాదు చేసి నిరసన వ్యక్తం చేశారు అంటూ చెప్పుకొచ్చారు.