
గత ఏడాది డిసెంబర్లో చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంతక వైరస్ కరోనా.. ప్రపంచదేశాలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికీ ఈ మహమ్మారి ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. ఈ కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్లు తెలంగాణలో మళ్లీ స్టార్ట్ అయ్యాయి. అలాగే మూతపడిన సినిమా థియేటర్లు కూడా త్వరలోనే తెరుచుకోనున్నాయి.
ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణలో మూతపడిన సినిమా థియేటర్లు వచ్చే నెల 4 నుంచి తిరిగి ఓపెన్ కానున్నాయి. యాబై శాతం సామర్థ్యంతో థియేటర్లను తిరిగి తెరవవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పేర్కొన్న నేపథ్యంతో థియేటర్ యజమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఈ నెల 4న ఓ ఇంగ్లిష్ సినిమా విడుదల కానుండడంతో.. ఆ రోజునే సినిమా హాళ్లను తిరిగి తెరవాలని నిర్ణయించారు. ఇక నాలుగు షోలే కాకుండా ఎక్కువ ఆటలు ప్రదర్శించుకోవచ్చని, టికెట్ల ధరలను పెంచుకోవచ్చంటూ తెలంగాణ సర్కార్ తెలిపడంతో.. ప్రస్తుతం థియేటర్ల యజమానులు ఆ దిశగానూ కసరత్తులు చేస్తున్నారు.