థియేటర్లో ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం…?!

November 23, 2020 at 5:35 pm

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళి మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. 50 శాతం వరకూ సీట్లతో మూవీ థియేటర్లను నిర్వహించేందుకు తాజాగా అనుమతి నిచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్బంగా రేపటినుండి మూవీ థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. టికెట్ల రేట్లు కొంత పెంచుకునేలా యాజమాన్యాలకు అధికారం ఇచ్చింది.

ఈ మేరకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం మూవీ థియేటర్స్లో మాస్కులు, శానిటైజర్‌ తప్పనిసరి, సినిమా హాళ్ల సిబ్బంది ఇంకా ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కనీస భౌతిక దూరం పాటించాలి. థియేటర్ లో ఏసీ టెంపరేచర్‌ 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా హాల్ యాజమాన్యం చేసుకోవాలంటూ కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టకేలకు కరోనా నిభందనలు పాటిస్తూ థియేటర్లు, మల్లీప్లెక్స్‌ల ఓపెనింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది తెలంగాణ సర్కార్.

థియేటర్లో ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం…?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts