బిగ్‌బాస్ నుంచి త‌ప్పుకుంటాన‌న్న నాగ్‌.. వారికి స్ట్రోంగ్ వార్నింగ్?

November 24, 2020 at 9:12 am

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4.. ప‌న్నెండో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో మోనాల్‌, అరియానా, హారిక‌, అభిజిత్‌, అఖిల్‌, సొహైల్ మ‌రియు అవినాష్‌లు మిగిలి ఉన్నారు. వీరిలో ఈ వారం అరియానా, మోనాల్‌, అఖిల్‌, అవినాష్‌లు నామినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే… బిగ్ బాస్ షో రోజురోజుకు రంజుగా కొన‌సాగుతున్నా రేటింగ్స్ మాత్రం ప‌డిపోతున్నాయి.

అందుకు కార‌ణం..లీకులే అని చెప్పాలి. ఈ సీజ‌న్ ప్రారంబానికి ముందు నుంచి లీకుల బెడ‌ద ప్రారంభ‌మైంది. షోలు ఎవ‌రు పాల్గొంటున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది ఎవ‌రు, టాస్కులు ఏంటీ, సీక్రెట్ టాస్కులు ఏంటీ, ఎవ‌రు ఏ వారం ఎలిమినేట్ అవుతారు ఇలా అన్నీ ముంద‌గానే సోష‌ల్ మీడియాలో లీక్ అయిపోతున్నాయి. ఇక స‌మాచారం ముందే తెలిసిపోవ‌డంతో.. షోపై ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి త‌గ్గిపోతుంది.

ఈ క్ర‌మంలోనే హోస్ట్ నాగార్జున షో నుంచి త‌ప్పుకుంటాన‌ని బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చార‌ట‌. ఎపిసోడ్ టెలికాస్ట్ అవ‌డానికి ముందే అన్ని విష‌యాలు లీక‌వ‌డం ప‌ట్ల తాజాగా నాగ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ట‌. లీకుల‌కు చెక్ పెట్టేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే షో నుంచి త‌ప్పుకునేందుకు సైతం ఏమాత్రం వెన‌క‌డాన‌ని మ‌రీమ‌రీ చెప్పార‌ట‌‌. దీంతో బిగ్ బాస్ నిర్వాహ‌కులు లీకుల‌ను అరిక‌ట్టే ప‌నిలో ప‌డ్డార‌ట‌.

బిగ్‌బాస్ నుంచి త‌ప్పుకుంటాన‌న్న నాగ్‌.. వారికి స్ట్రోంగ్ వార్నింగ్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts