మ‌న్మ‌థుడు కూడా ఓటీటీలోనే.. ఫిక్స్ అయిన నిర్మాత‌లు?

November 26, 2020 at 11:44 am

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా తెర‌కెక్క‌తున్న ఈ చిత్రం ఇటీవ‌లె మ‌నాలీలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా దియా మీర్జా కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు సిద్ధం అవుతున్నార‌ట‌.

ఈ ఏడాది థియేటర్లలో సినిమాలను విడుదల చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చే సంక్రాంతికి భారీ లైనప్ ఉంది. ఈ నేపథ్యంలో `వైల్డ్ డాగ్` నిర్మాతలు ఓటీటీలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ఈ చిత్రానికి ఓ ఆఫర్‌ వచ్చిందనీ, ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయనీ స‌మాచారం.

మ‌న్మ‌థుడు కూడా ఓటీటీలోనే.. ఫిక్స్ అయిన నిర్మాత‌లు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts