
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ‘అంటే.. సుందరానికీ !’ ఒకటి. ఇంట్రస్ట్రింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన నజ్రియ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం కథకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నాని బ్రాహ్మణ అబ్బాయిగా మరియు హీరోయిన్ నజ్రియ క్రిస్టియన్ అమ్మాయిగా కనిపించనున్నారట. ఇలా వేరే వేరే మతాలకు చెందిన హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి పడిన పాట్లే సినిమా లైన్ అని తెలుస్తోంది. తల్లిదండ్రులను ఒప్పించి హీరోయిన్ను పెళ్లి చేసుకునే క్రమంలోనే ఆ అమ్మాయి కూడా బ్రాహ్మణురాలే అని హీరో అబద్దమాడతాడట.
అనంతరం క్రిస్టియన్ అయిన హీరోయిన్ను బ్రాహ్మణురాలిగా మార్చడం, ఆ పద్దతులు, భాష, యాస ఆచారాలు నేర్పేందుకు హీరో కష్టాలు పడటం చాలా ఫన్నీగా ఉంటాయట. ఒకవేళ ఇదే నిజమైతే.. నాని ఈ తరహా కథాంశంతో చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. కాగా, త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, 2021లో విడుదల చేయనున్నారు.