నరసింహపురం లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..!

November 28, 2020 at 4:04 pm

శ్రీరాజ్ బళ్ళా, టి.ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాల కలిసి తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ నరసింహపురం. పలు సీరియల్స్, చిత్రాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ సినిమా ద్వారా హీరోగా మారుతున్నారు. వాస్తవ పరిస్థితులకు దగ్గరగా, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ చాల వరుకు పూర్తయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ అందరి దృష్టినీ బాగా ఆకర్షించాయి. తాజాగా ఈ సినిమా లిరికల్ వీడియోను లవర్ బోయ్ తరుణ్ ఆవిష్కరించారు. హీరో తరుణ్ మాట్లాడుతూ, నాకు మిత్రుడు, క్రికెట్ కో-ప్లేయర్ నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవ్వటం చాలా సంతోషం అని, నరసింహపురం చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తరుణ్ తెలిపారు.

హీరో నందు మాట్లాడుతూ, అడిగిన వెంటనే ఒప్పుకుని స్వయంగా తన ఇంట్లో మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన హీరో తరుణ్ గారికి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రంలో ఉన్న ఒకే ఒక డ్యూయెట్ తరుణ్ గారు రిలీజ్ చెయ్యడం చాలా హ్యాపీ గా ఉందంటూ, మా చిత్రం లిరికల్ వీడియో లాంచ్ చేసి, అభినందించిన హీరో తరుణ్ గారికి ధన్యవాదాలు తెలిపారు హీరో నందు.

నరసింహపురం లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts