నాటు బాంబు తో క్రికెట్ ఆడిన బాలుడు.. చివరికి ప్రాణం పోయింది..?

November 16, 2020 at 1:42 pm

మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చే కబలిస్తుంది అన్నది ఊహించని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఎంతో సంతోషంగా ఆడుకుంటున్న తరుణంలో విధి అతని ఆనందం చూసి ఓర్వలేక పోయింది. చివరికి అతన్ని మృత్యువు ఒడిలోకి చేర్చింది. ఏకంగా నాటు బాంబు పేలి ఏడవ తరగతి విద్యార్థి వర కుమార్ మృతి చెందడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నిండిపోయింది. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లి లో పాఠశాల పక్కన కొందరు నాటుబాంబులను దాచి ఉంచారు. ఈ క్రమంలోనే అదే ప్రాంతంలో ఆడుకుంటున్న వర కుమార్ ఆ నాటుబాంబులని చూసి క్రికెట్ బంతి అని అనుకున్నాడు దీంతో ఆ నాటుబాంబు తో ఆడుకుంటున్న సమయంలో ఏకంగా ఒక్కసారిగా నాటు బాంబు పేలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే నాటు బాంబులు పబ్లిక్ ప్లేస్ లో పెట్టి తమ కుమారుడి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.

నాటు బాంబు తో క్రికెట్ ఆడిన బాలుడు.. చివరికి ప్రాణం పోయింది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts