వివాదంలో చిక్కుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ..!?

November 24, 2020 at 3:37 pm

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గత కొన్ని నెలలుగా వరుస వివాదాలను ఎదుర్కొంటోంది. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇదివరకే సత్యం రామలింగరాజు జీవితంపై సిరీస్ విషయంలో కోర్టులో పోరాటం సాగిస్తోంది. రామలింగరాజు అనుమతి తీసుకోకుండా సిరీస్ తీశారని, తమ మనోభావాల్ని వారు కించపరిచారంటూ నెట్ ఫ్లిక్స్ పై రామలింగరాజు ఫ్యామిలీ పోరాటం చేస్తుంది.ఈ కేసు పై ప్రస్తుతం కోర్టులో విచారణ కోనసాగుతోంది.

ఇదిలా ఉంటుండాగానే ఏ సూటబుల్ బాయ్ అనే వెబ్ సిరీస్ ద్వారా హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ, నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులపై మధ్యప్రదేశ్ లో ఎఫ్ఐఆర్ నమోదైన విషయం మనకు తెలిసిందే. ఓ గుడి ప్రాంగణంలో ముద్దు సన్నివేశాలను చిత్రీకరించడం ఈ వివాదానికి ముఖ్య కారణం. నెట్ ఫ్లిక్స్ సిరీస్ రూపకర్తల నుండి క్షమాపణ డిమాండ్ చేస్తూ, ఆ అభ్యంతరకర స్కీన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసారు భారతీయ జనతా యువ జాతీయ కార్యదర్శి గౌరవ్ తివారీ. ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై రేవా పోలీసులు అభియోగాలు మోపుతున్నారు.

వివాదంలో చిక్కుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts