బిబి4: ఈ కంటెస్టెంట్ ఓవర్ సింపథీ.. బెడిసికొట్టేలా ఉందే?

November 25, 2020 at 1:59 pm

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ ప్ర‌స్తుతం ప‌న్నెండో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌కు చేర‌వ‌వుతున్న ఈ షోలో అరియానా, అభిజిత్‌, అవినాష్‌, మోనాల్‌, సొహైల్‌, అఖిల్ మ‌రియు హారిక‌లు మిగిలి ఉన్నారు. అయితే వీరింద‌రూ స్ట్రోంగ్ కంటెస్టెంట్లే కావ‌డంతో.. ఒక‌ర్ని మించి ఒక‌రు టైటిల్ కోసం పోటీ ప‌డుతున్నారు.

అయితే వీరిలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్.. త‌న‌పై ప్రేక్ష‌కుల్లో సింపథీ పెరిగేలా గేమ్ ఆడుతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌ర‌చూ కెమెరా ముందుకు వ‌చ్చి త‌న క‌ష్టాలు, ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్తుండ‌డం ప్రేక్ష‌కుల‌ను అస‌హ‌నానికి గురి చేస్తోంది. ఇక నిన్న కూడా మోషనల్ మార్గాన్నే ఎంచుకుని.. ‌నామినేష‌న్ నుంచి సేవ్ అయ్యేందుకు ఇంటి స‌భ్యుల‌ను ఓట్లు అడిగాడు.

దీంతో వాళ్లు క‌రిగిపోయి.. అవినాష్‌నే సేవ్ చేశారు. దీంతో ప్ర‌తిసారి ఇలా హౌజ్ లో ఉండేందుకు సింప‌థీ క్రియేట్ చేస్తూ.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నెటిజన్లు పండిప‌డుతున్నారు. ఈ విషయం ఆయనకు అర్థం కావడం లేదంటూ సన్నిహితులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక ఒక‌వేళ ముందు ముందు కూడా అవినాష్ ఇలానే సింప‌థీ గేమ్ ఆడితే.. బెడిసికొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

బిబి4: ఈ కంటెస్టెంట్ ఓవర్ సింపథీ.. బెడిసికొట్టేలా ఉందే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts