నిహారిక విషయంలో ఆ తప్పు చేయాల్సింది కాదు : నాగబాబు

November 25, 2020 at 5:11 pm

మెగా బ్రదర్ నాగబాబు ఓవైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా జడ్జిగా ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను సంపాదించుకున్న విషయం తెలిసిందే అదే సమయంలో యూట్యూబ్ లో కూడా తన ఛానల్ ద్వారా ఎన్నో తన అనుభవాలను ఎంతో మందితో పంచుకుంటూ పలు కీలక సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కమ్యూనికేషన్ అనే అంశం మీద మాట్లాడిన నాగబాబు తన పర్సనల్ లైఫ్ లో జరిగిన పలు కీలక విషయాలను గురించి చెప్పుకొచ్చారు.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ప్రేమగా ఉండాలి అని సూచించారు. పిల్లలు ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చెప్పుకునే స్వేచ్ఛను.. వారికి ఇవ్వాలి అంటూ సూచించారు. తాను కూడా తన పిల్లల విషయంలో ఇలాగే వ్యవహరిస్తా అంటూ చెప్పుకొచ్చారు కానీ ఒకప్పుడు ఇంతలా పరిపక్వత లేదని అందుకే తన పిల్లలు ఏ చిన్న తప్పు చేసినా గట్టిగా మందలించడం లాంటివి చేశానని కొన్నిసార్లు కొట్టాను అంటూ చెప్పుకొచ్చారు. నిహారిక వరుణ్ విషయంలో తాను చేసిన ఒకే ఒక తప్పు అదే అంటూ చెప్పుకొచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు.

నిహారిక విషయంలో ఆ తప్పు చేయాల్సింది కాదు : నాగబాబు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts