
ఈ ఏడాది ఆరంభంలో `భీష్మ` చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో `రంగ్ దే` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్‌కు తన శ్రీమతి షాలినీని తీసుకుని మరీ జంటగా వెళ్లాడు నితిన్. కరోనా కారణంగా పెళ్లయ్యాక హనీమూన్‌కు వెళ్లలేకపోయింది ఈ కొంత జంట. అందుకే ఇలా సినిమా షూటింగ్ వంకతోనైనా హనీమూన్‌కు వెళ్లినట్టుందని నితిన్ షాలినీని కూడా తీసుకువెళ్లాడట.
మొత్తానికి దుబాయ్‌లో ఓవైపు పర్సనల్ పనులు.. మరో వైపు ప్రొఫెషనల్ పనులు కానిచ్చేస్తున్నాడు నితిన్. ఇదిలా ఉంటే.. దుబాయ్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసిన ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో కీర్తి మరియు నితిన్ చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు. దానిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.