నితీష్ మంత్రివర్గంలో ఆ మంత్రిని టార్గెట్ చేసిన తేజస్వి.?

November 22, 2020 at 1:59 pm

బీహార్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్ ప్రస్తుతం నితీష్ మంత్రివర్గంపై ఏ రేంజిలో విమర్శలు గుప్పిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా నితీష్ మంత్రివర్గంలోని ఒక్కో మంత్రి ని టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేస్తూ ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు తేజస్వి యాదవ్. మొన్నటికి మొన్న మోహన్లాల్ చౌదరి ని టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేసిన తేజస్వి ఇప్పుడు మరో మంత్రి ని టార్గెట్ చేశారు

జేడీయూ కార్యనిర్వాహక అధ్యక్షుడు… మంత్రి అశోక్ చౌదరి ని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం విమర్శలు కురిపిస్తున్నారు తేజస్వి యాదవ్. ప్రస్తుతం తేజస్వి చేసిన విమర్శలు కాస్త బీహార్ రాజకీయాల్లో సంచలనం గా మారిపోయింది. ముఖ్యమంత్రి నితీశ్ కు ఎంతో ఆప్తుడు అయినా అశోక్ చౌదరి కుటుంబం పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని బ్యాంకును మోసం చేశారని.. దొంగతనం చేశారని.. ఇలా ఎన్నో ఆరోపణలు ఉన్నాయని దీనిపై కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయని సిబిఐ దర్యాప్తు కూడా కొనసాగుతుందని… అయినప్పటికీ ఇలాంటి ఆరోపణలు పెద్ద విషయం కాదు అంటున్న జెడియు.. నిజాయితీ ఏంటో ప్రజలకు చెబుతుంది అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

నితీష్ మంత్రివర్గంలో ఆ మంత్రిని టార్గెట్ చేసిన తేజస్వి.?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts