నివర్ తుఫాను రేపు తమిళనాడులో సెలవు..?

November 25, 2020 at 6:04 pm

ప్రస్తుతం నివర్ తుఫాను అంతకంతకూ తీవ్రమౌతుంది. ప్రజలందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది అన్న విషయం తెలిసిందే. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ నివర్ తుఫాను అంతకంతకు మరింత తీవ్రతరం అవుతూ ఉండటం తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వైపుగా దూసుకు వస్తూ ఉండటంతో ప్రస్తుతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి అంతేకాకుండా ఈ తుఫాను ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో అని అటు ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో భయాందోళనలో మునిగిపోతున్నారు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను తమిళనాడుకు 180 కిలోమీటర్ల దూరంలో పుదుచ్చేరికి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రస్తుతం అంతకంతకూ నివర్ తుఫాను తీవ్రతరం అవుతుంది అని అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు ఇక ఇప్పటికే తమిళనాడులోని తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలోనే అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం తుఫాను ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

నివర్ తుఫాను రేపు తమిళనాడులో సెలవు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts